తెలుగు | English

ప్రమాణ పత్రం

మా నూతన పార్టీ ఆలోచనలు దేశానికి మంచి చేసే విదంగా ఉంటే మా పార్టీలో సభ్యత్వం పొందడానకి ముందు దయచేసి మా పార్టీ సిద్దాంతాల ప్రకారం నడుచుకొనుటకు ఒక ప్రమాణ పత్రం మీద మీరు ప్రమాణం చేయవలసిందిగా కోరుచున్నాము.

నూతన పార్టీ సభ్యునిగా నేను అనగా ---------------------------------- అనే నేను నా దేశం పైన ప్రేమ మరియు భాద్యతతో ఈ క్షణం నుండి ఈ దిగువ వ్రాసిన పార్టీ సూత్రాలను తప్పక పాటిస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

1. భారతదేశ పౌరుడిగా నేను జీవించి ఉన్నంతకాలం మానవ మనుగడకు భంగం కలిగే విదంగా జీవించనని ప్రమాణం చేస్తున్నాను.

2. భారతదేశ పౌరుడిగా నేను జీవించి ఉన్నంతకాలం నా దేశానికి కానీ నా దేశ ప్రజలకు గానీ ఏ సమయంలోనైనా తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

3. ఒక భారతదేశ పౌరుడిగా నేను ప్రభుత్వం ఇచ్చే ఉచిత పదకాల పైన కానీ ఇతరులు, ఇతర సంస్దలు ఇచ్చే ఉచిత పధకాలు మీద కానీ ఆదారపడను నేను నా స్వయంకృషితో ఈక్షణం నుండి జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

4.భారతదేశ పౌరుడిగా నాదేశంలో ఏ ఒక్కరు కూడా ఇతరులపైన ఆదారపడకుండా ఉండటానికి నా బాద్యతగా వారికి ఆత్మస్దైర్యాన్ని కల్పించడానికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.

5. ఒక భారతదేశ పౌరుడిగా నేను ప్రతీ రోజు ఏదోఒక సమయంలో నాదేశ క్షేమం కోసం కనీసం ఒక 1గంట సమయాన్నైనా దేశ ప్రజల కోసం కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

6. భారతదేశ పౌరుడిగా నేను జీవించి ఉన్నంతకాలం ఉచిత విద్య ఉచిత వైద్యం దేశప్రజలందరికి అందే వరకు ఏసహాయానికైనా ఈక్షణం నుండి సిద్దంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

7. భారతదేశ పౌరుడిగా నాదేశంలో ఆకలి అనే ఏ ఒక్కరి నోట వినపడకుండా నా వంతుగా ఏ సహాయానికైనా నేను ఈక్షణం నుండి సిద్దంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

8. భారతదేశ పౌరుడిగా నాదేశంలో బాల కార్మికులు లేని భారతదేశాన్ని చూసేవరకు నేను ఈక్షణం నుండి బాలల సంరక్షణకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.

9. భారతదేశ పౌరుడిగా స్త్రీలకు పురుషులకు సమన్యాయం జరిగే విదంగా ఈక్షణం నుండి నావంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.

10. భారతదేశ పౌరుడిగా వికలాంగులు, వృద్దులు, వితంతువులు వీరందరికి కూడా ప్రశాంతమైన జీవనం గడిపేందుకు కావలసిన సహాయం ఈక్షణం నుండి నావంతుగా అందించడానికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.

11. ఈ నూతన పార్టీ సభ్యునిగా ఉన్నంతకాలం నేను భారతదేశ ఎన్నికలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిలబడనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతేకాదు మా నూతన పార్టీ సిద్దాంతాలను ఎన్నడు దిక్కరించకుండా సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని నామనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

12. భారతదేశ పౌరుడిగా తల్లి తండ్రి, గురువు, రైతులు, కార్మికులు, వైద్యులు, నాదేశం, దైవం అని మనస్సాక్షిగా ప్రార్దిస్తూ నాజీవన మార్గంలో వీరి ఆశీస్సులతోనే ముందుకు వేళ్తానని ప్రమాణం చేస్తున్నాను. జైహింద్....జైహింద్....జైహింద్...