తెలుగు | English

మా గురించి కొన్ని విషయాలు

prasad

నా పేరు బి.ఎ.వి.వి సత్యప్రసాద్ నేను విజయనగరం జిల్లా బొబ్బిలిలో నివాసం ఉంటున్నాను.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఈరోజు వరకు మన దేశం ఆర్దికంగా ఎంతో అభివృద్ది చెందింది. అంతేకాదు మన దేశం ప్రపంచ దేశాలకు ఏ రంగంలోనైనా పోటీ ఇస్తుంది. కానీ మన భారతదేశంలో ప్రజలకు స్వతంత్ర్యం వచ్చిన దగ్గరనుండి ఈరోజు వరకు సమాన విధ్య, వైధ్యం, ఆహారా భధ్రత మరియు కొన్ని ప్రభుత్వ సేవలు కల్పించడంలో మన దేశ పరిపాలన వ్యవస్ద విఫలం అయిందని పూర్తిగా చెప్పవచ్చు. దీనికి గల కారణం మనం మన జీవన పరిస్దితులను బట్టి తయారు చేసుకున్న రూపాయి మానవ మనుగడనే శాసిస్తుంది.దీని మూలాన్ని ఎందకు కట్టడి చేయలేము అని నా మనసుకు అనిపించింది. దీనికి మూలం రాజకీయ వ్యవస్ద. ఈ రాజకీయ వ్యవస్దలోని లోపాలను మన దేశ ప్రజలు మార్చగలరు అని నమ్మకం నాకు ఉంది. అందుకే నూతన పార్టీ నినాదంతో మీముందుకు వచ్చాను.

ఉచిత విద్య, వైద్యం మరియు ఆరోగ్యం మన ప్రపంచంలోని ప్రజలందరికి అందించడానికి సంస్థను ఏర్పాటు చేయడం నా కల.

మా నూతన పార్టీ విదానాల వలన వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ దనం కానీ ప్రజా దనం కానీ వృదా అవదు అనే నమ్మకంతో నూతన విదానాలతో నూతన రాజకీయ పార్టీ యెక్క ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను.

విద్యా అర్హతను బట్టి లేదా ప్రతిభకు తగిన విధంగా కేటగిరి వారీగా విభజించి ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

ప్రజా రక్షణ కమిటీ అంటే: ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడి నిరంతర పర్యవేక్షణలో మన దేశ ప్రజా స్వామ్య హక్కులను ప్రజాస్వామ్య బద్దంగా దేశ ప్రజలందరికీ అందించడమే ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

మన దేశంలో పాత కాంట్రాక్ట్ విదానాన్ని రద్దుచేసి నూతన కాంట్రాక్ట్ విదానాన్ని తీసుకువస్తాం. ఈ నూతన కాంట్రాక్ట్ విదానం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యెక్క కాంట్రాక్ట్ పనులు జరుగును. ఈ నూతన కాంట్రాక్ట్ విదానంలో ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఈ ప్రజా రక్షణ కమిటీలకే ప్రదమ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సబ్ కాంట్రాక్టర్లుగా ప్రజా రక్షణ కమిటీల ద్వారా మాత్రమే ఎంత పెద్ద సంస్దలైనా అనుమతి పొందవలసి ఉంటుంది.

విద్యా అర్హతను బట్టి లేదా ప్రతిభకు తగిన విధంగా కేటగిరి వారీగా విభజించి నూతన కాంట్రాక్టు వ్యవస్థలను ఏర్పాటు చేసి వీటిని నిరుద్యొగ ఉపాది కార్యాలయాలు ద్వారా ప్రతీ ఒక్క పౌరునుకి ఉపాది అవకాసాలు కలిపిస్తాం

1. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

2. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

3. ఒక ప్రభుత్వ అధికారికి ఏ విధంగా జవాబుదారి తనంతో అధికారాలు వున్నాయో అదే విధంగా ప్రజా ప్రతినిధులకు కూడా జవాబుదారి తనంతో కూడిన హక్కులను కలిగి వుండే విధంగా నూతన చట్టాన్ని తీసుకు వస్తాం. ఆ చట్టం పేరే ప్రజా రక్షన కమిటీ.

4. ప్రజా రక్షణ కమిటీలు అంటే పెట్టుబడి లేని భారతదేశ ఆర్దిక వ్యవస్దలుగా అబివృద్దిపరచడమే ఈ ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

5. ప్రజా రక్షణ కమిటీ పరిదిలో గల విఙ్నానవంతులు, మేధావులు, తెలివితేటలు కలిగిన వారిని గుర్తించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి మా నూతన పార్టీ దేశ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.

మా నూతన జాతీయ పార్టీ పరిపాలన విధానాలు.

1. సమ సమాజ నిర్మాణమే మాపార్టీ లక్ష్యం.

2. మనదేశంలో విద్యార్హత లేదా వృత్తిని బట్టి కేటగిరీలుగా విభజించి మనదేశ పరిపాలన చేస్తాము.

3. కులము అంటే వృత్తి.

4. మతము అంటే ధర్మ మార్గము.

5. మానవజాతి మనుగడను కాపాడటమే మాపార్టీ ధర్మం.